ఏపీ శాసన మండలి ఛైర్మన్ కు కరోనా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా రాజకీయ నేతలు కరోనా బారిన పడుతుండగా..తాజాగా శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడ్డారు. నాల్గు రోజులుగా కాస్త జ్వరం వస్తుండడం తో.. కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్ అని తేలింది.

ప్రస్తుతం షరీఫ్… హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షరీఫ్‌ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు ఆకాంక్షించారు. ఇప్పటికే చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.