ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు పది వేల కేసులు నమోదు అవుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 62,024 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10,548 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 4,11,269కు పెరిగాయి.
జిల్లాల వారీగా చూస్తే..
అనంతపురంలో 864, చిత్తూరులో 813, తూర్పు గోదావరిలో 1096, గుంటూరులో 635, కడపలో 991, కృష్ణాలో 362, కర్నూలులో 791, నెల్లూరులో 1038, ప్రకాశంలో 870, శ్రీకాకుళంలో 522, విశాఖలో 988, విజయనగరంలో 715, పశ్చిమ గోదావరిలో 863 కేసులు నమోదయ్యాయి.