తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం పెరుగుతూనే ఉంది..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కొత్తగా కేసులు సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 2,932 మందికి కారోనా వైర‌స్ సోకింది. దీంతో క‌రోనా బాధితులు 1,17,415కి చేరారు. ఇందులో 28,941 కేసులు యాక్టివ్‌గా ఉండగా, అందులో 22,097 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

క‌రోనా వైర‌స్ వ‌ల్ల‌ నిన్న కొత్త‌గా 11 మంది మ‌ర‌ణించారు. దీంతో క‌రోనా మృతులు 799కి పెరిగారు. ఈసారి కూడా గ్రేటర్‌లోనే కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అయ్యింది. హైదరాబాద్‌లో కొత్తగా 520 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. మిగతా జిల్లాల విషయానికి వస్తే..క‌రీంన‌గ‌ర్ జిల్లా‌లో 168, న‌ల్ల‌గొండ‌లో 159, ఖ‌మ్మంలో 141, నిజామాబాద్ 129, జ‌గిత్యాల‌లో 113, మంచిర్యాల‌లో 110, సూర్యాపేట 102, సిద్దిపేట‌లో 100, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 89, వ‌రంగ‌ల్ అర్బ‌న్ 80, మ‌హ‌బూబాబాద్‌లో 76, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 67, సిరిసిల్ల జిల్లాలో 64, పెద్ద‌ప‌ల్లిలో 60, వ‌న‌ప‌ర్తి 51, కామారెడ్డి 51, సంగారెడ్డి 49, జోగులాంబ గ‌ద్వాల 46, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 42, యాదాద్రి భువ‌న‌గిరిలో 42, జ‌న‌గామ 38, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 34, నిర్మ‌ల్‌లో 32, ఆదిలాబాద్ 25, మెద‌క్ 24, వికారాబాద్ 22, ములుగు 18, నారాయ‌ణ‌పేట‌లో 16, ఆసిఫాబాద్ జిల్లాలో 15, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి 13 చొప్పున ఉన్నాయి.