ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ..వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. వ్యవసాయం, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరి పీచు, పసుపు ఉత్పత్తి ఎగుమతులకు సంబంధించిన నివేదికను ఆయన ఉపరాష్ట్రపతి అందజేశారు.
వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆ నివేదికలో కోరారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని వినతిపత్రం అందజేసినట్లు తెలియపరు. విజయసాయిరెడ్డి పార్లమెంట్ స్థాయి సంఘం వాణిజ్యం కమిటీ చైర్మన్గా ఉన్నారు.