నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం వి
. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉగాది కానుకగా మర్చి 25 ‘న రిలీజ్ చేయాలనీ నిర్మాత దిల్ రాజు అనుకున్నాడు. కానీ అదే సమయంలో కరోనా వైరస్ ఎంట్రీ కావడం , ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం తో సినిమా ల్యాబ్ కే పరిమితం అయ్యింది.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ల్యాబ్ కే పరిమితమైన సినిమాలు ఓటిటి లో రిలీజ్ అవుతుండగా..వి చిత్రం సైతం ఓటిటి రిలీజ్ చేయాలనీ నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రాన్ని భారీ ధరకు కొనుగోలు చేయడం తో ఈ చిత్రానికి భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5 న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ లలో పాల్గొన్న నాని.. ‘తను రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌ను రూపొందించే యోచనలో ఉన్నానని తెలిపాడు. ఇక తన ‘వి’ చిత్రం ఆన్లైన్లో విడుదల అవుతుందని తాను ముందే భావించానని, ఇప్పుడు అది జరుగుతోందని నాని చెప్పుకొచ్చాడు.