తెలంగాణలో కరోనా వైరస్ కంట్రోల్

జీహెచ్‌ఎంపీ పరిధిలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.  సెప్టెంబరు నెలాఖరునాటికి రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. కొవిడ్‌పై ప్రజల్లో చాలా వరకు అవగాహన పెరిగిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని సూచించారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ను దాదాపు అదుపులోకి తీసుకొచ్చామన్నారు. కరోనా పరీక్షల సంఖ్య గతంలో కంటే పెంచామని, రాష్ట్రంలో ఇప్పటి వరకూ 10.21 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు.