తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసులు ప్రతి రోజు రెండు వేలకుపైగానే నమోదు అవుతున్నప్పటికీ GHMC పరిధిలో భారీగా తగ్గడం తో నగరవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,579 కరోనా పాజిటివ్కేసులు నమోదు అయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 1,08,670కు కేసుల సంఖ్య చేరాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాల వారీగా కేసులు చూస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 295, రంగారెడ్డి జిల్లాలో 186, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 83, ఖమ్మంలో 161, వరంగల్ అర్బన్ జిల్లాలో 143, వరంగల్ గ్రామీణ జిల్లాలో 31, ఆదిలాబాద్ జిల్లాలో 34, జగిత్యాల జిల్లాలో 98, జనగామా జిల్లాలో 46, జోగుళాంబా గద్వాల జిల్లాలో 47, నల్గొండ జిల్లాలోలో 129, కామారెడ్డి జిల్లాలో 64, సిద్దిపేట జిల్లాలో 92, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 59, పెద్దపల్లి జిల్లాలో 85, సూర్యాపేట జిల్లాలో 78, నిజమాబాద్ జిల్లాలో 142, మహబూబాబాద్ జిల్లాలో 81, మహబూబ్నగర్ జిల్లాలో 69, నారాయణపేట జిల్లాలో 19, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 10, మెదక్ జిల్లాలో 42, ములుగు జిల్లాలో 16, నిర్మల్ జిల్లాలో 28, సంగారెడ్డి జిల్లాలో 30, వికారాబాద్ జిల్లాలో 23, వనపర్తి జిల్లాలో 56, యాదాద్రి భువనగిరి జిల్లాలో 46, నాగర్కర్నూల్ జిల్లాలో 48, మంచిర్యాల జిల్లాలో 104, కరీంనగర్ జిల్లాలో 116, కామారెడ్డి జిల్లాలో 64, భూపాలపల్లి జిల్లాలో 12, జగిత్యాల జిల్లాలో 98, ఆదిలాబాద్ జిల్లాలో 34 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
#COVID19India#Telangana
New Cases – 2,579
Active Cases – 23,737
Total Cases – 1,08,670#WearAMask #StayHome#DonatePlasmaSaveLives pic.twitter.com/km9AknbShq— BARaju (@baraju_SuperHit) August 25, 2020