కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీనే మరికొంతకాలం పాటు అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏమీ తేల్చలేకపోయింది.
నేడు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ హైడ్రామా నడుమ సాగింది. అయితే, పార్టీ ప్రెసిడెంట్ పదవి ఎవరికి అప్పగించాలన్న దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోనియానే మధ్యంతర చీఫ్ గా కొనసాగనున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తనను తప్పించాలంటూ సోనియానే స్పష్టం చేసినా, ఈ పరిస్థితుల్లో మరో మార్గం లేక పార్టీ సీనియర్లు ఆమెపైనే భారం వేశారు.