ఇండస్ట్రీ లో వారసుల ఎంట్రీ అనేది కామన్. ఇప్పటికే చాలామంది ఆలా ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టన్ని పరీక్షించుకోగా..ఈ జాబితాలో ఎన్టీఆర్ బావమరిది (లక్ష్మీ ప్రణతి సోదరుడు) నార్నే నితిన్ రావాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, నటనలో నితిన్ శిక్షణ కూడా తీసుకున్నాడట. అయితే ఈ విషయంలో ఫైనల్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎన్టీఆర్‌ని కలవగా.. నితిన్ ఎంట్రీకి ఎన్టీఆర్ నో చెప్పాడట.
హీరోగా రాణించడం అన్నది కత్తి మీద నడకలాంటిదని, కాస్త బ్యాలెన్స్ తప్పినా ఆ ఎఫెక్ట్ కెరీర్ మొత్తం మీద పడుతుందని ఎన్టీఆర్, నితిన్‌కి సూచించినట్లు టాక్. అలాగే ప్రస్తుతం టాలీవుడ్లో కాంపిటేషన్ చాలా ఉందని, ఇలాంటి సమయంలో హీరోగా రాకపోవడమే మంచిదని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. నితిన్‌పై నమ్మకం ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఈ మేరకు సూచనలు చేసినట్లు సమాచారం.