వివాదాలకు దూరంగా ఉండే హీరో రామ్..తాజాగా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ మధ్యనే విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే . ఈ ప్రమాదంలో కరోనా రోగులు 10 మంది వరకు చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణం యాజమాన్య లోపమే అని పోలీసులు కేసు నమోదు చేసారు. దీనిపట్ల హీరో రామ్.. జగన్ ప్రభుత్వం ఫై విమర్శలు చేయడం తో వైసీపీ కార్య కర్తలు , అభిమానులు , కొంతమంది నెటిజన్లు రామ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.
విజయవాడ రమేష్ ఆసుపత్రి గురించి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని సినీ నటుడు రామ్ చదివాడని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. రామ్ సినిమాలు కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా.! వేరే వాళ్లు చూడరా..! వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్‌ని చెప్పమనండి అని వంశీ విమర్శలు గుప్పించారు.