బిగ్ బాస్ హౌస్ లోకి ఆ హాట్ ఆంటీ వెళ్లాలనుకోవడం లేదట..

సీనియర్ నటి ప్రగతి తెలియనివారుండరు..హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఈమె..ప్రస్తుతం తల్లి పాత్ర ల్లో ఎక్కువగా నటిస్తూ వెండితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తెరపై అమ్మ పాత్రలో కనిపించినప్పటికీ..సోషల్ మీడియా లో మాత్రం తనలోని గ్లామర్ యాంగిల్ ను చూపిస్తూ నెటిజన్లను నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఏ మధ్య సోషల్ మీడియా లో ఎక్కువగా హడావిడి చేస్తుండడం తో అంత ఈమె హడావిడి అంత కూడా బిగ్ బాస్ 4 ఎంట్రీ కోసమే అని ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారం పట్ల ప్రగతి స్పందించింది.

ఫేమ్ నాకు ఇప్పటికే ఉంది.. నాకు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది ఇక డబ్బు విషయంలో నాకు పట్టింపు లేదు కనుక నేను బిగ్ బాస్ కు వెళ్లాలనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అయినా మళ్లీ ప్రచారం జరుగుతూనే ఉన్న నేపథ్యంలో మరోసారి ప్రగతి స్పందించింది. నేను బిగ్ బాస్ లో పాల్గొనబోవడం లేదు. అవన్నీ రూమర్స్ మాత్రమే. ఒకవేళ వాళ్లే వచ్చి నన్ను అడిగినా కూడా ఆసక్తి లేదని చెప్పేస్తాను అని తేల్చి చెప్పింది.