ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు..ఓ పక్క వర్షాలు , మరో పక్క కరోనా ఈ రెండింటితో ప్రజలు భయం భయంతో బ్రతుకుతున్నారు. గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 57,685 శాంపిల్స్ పరీక్షించగా వాటిల్లో 9742 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిపింది. అలాగే ఈ కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 316003కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 95మంది మరణించడం తో మొత్తం మరణాల సంఖ్య 2906కి చేరింది. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1396, అనంతపురం జిల్లాలో 1123, పశ్చిమగోదావరి జిల్లాలో 919, విశాఖపట్నం జిల్లాలో 835, చిత్తూరు జిల్లాలో 830, కర్నూలు జిల్లాలో 794, నెల్లూరు జిల్లాలో 755, కడప జిల్లాలో 673, ప్రకాశం జిల్లాలో 585, శ్రీకాకుళం జిల్లాలో 565, గుంటూరు జిల్లాలో 555, విజయనగరం జిల్లాలో 428, కృష్ణా జిల్లాలో 281కేసులు నమోదయ్యాయి.
#COVID19India#AndhraPradesh
New Cases – 9,393
Active Cases – 87,177
Total Cases – 3,25,396#WearAMask #StayHome#DonatePlasmaSaveLives pic.twitter.com/4NtyCJEk7d— BARaju (@baraju_SuperHit) August 20, 2020