ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి రోజు వేల సంఖ్య లో కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 86,725 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,26,372 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకు జిల్లాల వారీగా కేసులు చూస్తే.. అనంతపురంలో 1123, చిత్తూరులో 830, తూర్పు గోదావరిలో 1399, గుంటూరులో 555, కడపలో 673, కృష్ణాలో 281, కర్నూలులో 794, నెల్లూరులో 755, ప్రకాశంలో 585, శ్రీకాకుళంలో 565, విశాఖలో 835, విజయనగరంలో 428, పశ్చిమ గోదావరిలో 919 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.
#COVID19India#AndhraPradesh
New Cases – 9,742
Active Cases – 86,725
Total Cases – 3,16,003#WearAMask #StayHome #DonatePlasmaSaveLives pic.twitter.com/On2cmoWRRh— BARaju (@baraju_SuperHit) August 19, 2020