డైరెక్టర్ బి గోపాల్ అంటే తెలియని సినీ అభిమాను ఉండడు. కలెక్టర్ గారి అబ్బాయి, బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, లారీ డ్రైవర్, స్టేట్ రౌడీ , మెకానిక్ అల్లుడు, సమరసింహా రెడ్డి, ఇంద్ర వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందజేసి మాములు హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన గొప్ప డైరెక్టర్.
అలాంటి డైరెక్టర్ తో నటసింహ బాలకృష్ణ తో వర్క్ చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో సమరసింహా రెడ్డి చిత్రం వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు చేసింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండడం అభిమానుల్లో ఆనందం నింపుతుంది. ఈ సినిమా కోసం గోపాల్ టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చేత ఫుల్ స్క్రిప్ట్ రాయించాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ అంత పూర్తి అయ్యింది. త్వరలోనే బాలయ్య కు ఈ కథ వినిపించాలని గోపాల్ , సాయి అనుకుంటున్నారట. మరి స్క్రిప్ట్ బాలయ్యకు నచ్చితే వచ్చే ఏడాది నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.