రైన్స్ పై జగన్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతోన్న విషయం తెలిసిందే. గోదావరి వరద పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. దీంతో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అక్కడి పరిస్థితులన ఆయన అడిగి తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, తాను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నానని జగన్ అన్నారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని ఆయన చెప్పారు. బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు.