అయిదు నగరాల్లో ‘పవిత్ర’ ఆడియో

pavitra-audioశ్రియ కథానాయికగా జనార్థన మహర్షి దర్శకత్వంలో కె. సాదక్ కుమార్, జి. సాయి
మహేశ్వర రెడ్డి నిర్మించిన చిత్రం ‘పవిత్ర’. పల్లూర్ రవీందర్ రెడ్డి సమర్పకుడు. ‘ఎ బోల్డ్ అండ్ గోల్డ్ ఫిల్మ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. ఈ పాటలను వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, తిరుపతిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఒక్కోపాటను ఒక్కో ప్రాంతంలో విడుదల చేయనున్నారు. వచ్చే నెల 6, 7 తేదిల్లో ఈ పాటల ఆవిష్కరణ జరగనుంది. రెండు రోజుల్లో విమానంలో ప్రయాణం చేసి, ఈ ఏరియాలను సందర్శించనుంది చిత్రబృందం. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ‘పేరు మట్రుమ్ దాన్ పవిత్ర’ అనే టైటిల్ తో , మళయాళంలో ‘పవిత్ర’ పేరుతో విడుదల చేయబోతున్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నా సినిమా కెరీర్ లో ఇంత వినూత్నంగా జరుపుకోబోతున్న ఆడియో ఆవిష్కరణ ఇదే అవుతుంది. పవిత్రగా నన్ను జనార్థన మహర్షి అద్భుతంగా మలిచారు. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. “ ఒక మంచి సినిమా నిర్మిస్తున్నామనే తృప్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని జనార్థన మహర్షి అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఇంటర్నెట్ లో కూడా చిత్రం ఫొటోలను ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఇది మంచి మ్యూజికల్ ఫిల్మ్ గా నిలుస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు. జనార్థన మహర్షి మాట్లాడుతూ.. “నిజాయితీగా ఓ మంచి ప్రయత్నం చేస్తునాం. అందుకే ఇది బంగారంలాంటి సినిమా అంటున్నారు. ఇందులో ఉన్న ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుంది” అని చెప్పారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, యండమూరి వీరేంద్రనాథ్, ఏవీయస్, సాయికుమార్, రోజా, రవిబాబు, కౌశిక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : ఎం.ఎం. శ్రీలేఖ, కెమెరా : సురేష్ కుమార్, నిర్మాతలు : కె. సాదక్ కుమార్, జి. సాయి మహేశ్వర రెడ్డి, సమర్ఫణ.