వివాదాలకు దూరంగా ఉండే హీరో రామ్..తాజాగా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ మధ్యనే విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే . ఈ ప్రమాదంలో కరోనా రోగులు 10 మంది వరకు చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణం యాజమాన్య లోపమే అని పోలీసులు కేసు నమోదు చేసారు. దీనిపట్ల హీరో రామ్.. జగన్ ప్రభుత్వం ఫై విమర్శలు చేయడం తో వైసీపీ కార్య కర్తలు , అభిమానులు , కొంతమంది నెటిజన్లు రామ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద దుర్ఘటనకు సంబంధించి విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారికైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని, విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులు జారీ చేస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు తేల్చి చెప్పారు. దింతో రామ్ పేరు ఇంకాస్త వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రామ్‌కు మద్దతు తెలుపుతూ ఏసీపీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని తెలిపారు.