సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు, నటుడు రాజా ఓ ఇంటివాడు కానున్నాడు. తాజాగా ఆయన నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాలు వివరిస్తూ రాజా తనకు కాబోయే భార్యతో దిగిన ఫొటోను ఇన్స్టాలో పంచుకున్నారు.
‘‘ఇది 2020లో అత్యుత్తమ భాగం. కొత్త ప్రయాణం ఆనందంగా ఉంది. మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు’ అంటూ ఆయన రాసుకొచ్చారు. సహ నటుడిగా రాజా తనదైన పాత్రల్లో ఒదిగిపోతున్నారు. ‘ఎవడు’, ‘ఫిదా’,‘రణరంగం’,‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.