కరోనా తో భారత మాజీ క్రికెటర్ మృతి..

కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. సామాన్య ప్రజలనే కాక సెలబ్రెటీస్ ను సైతం వణికిస్తోంది. ఇప్పటికే పలువురు కరోనా మహమ్మారితో మరణించగా..తాజాగా భారత మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ కన్నుమూశారు. జూలై 12 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో చేరారు.

అక్కడ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత క్షీణించింది. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతకు తరలించారు. కానీ అక్కడ కూడా ఆయన ప్రాణాలతో బయటపడలేకపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో చౌహాన్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. భారత్‌ తరఫున 40 టెస్టులు ఆడిన చౌహాన్‌.. సునీల్‌ గవాస్కర్‌తో కలసి ఓపెనర్‌గా బరిలో దిగారు. అలాగే ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో పలు హోదాల్లో పనిచేశారు.