ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 48,746 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 8,012 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,89,829కు చేరింది. గడిచిన 24 గంటల్లో 48,746 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 8,012 మందికి పాజిటివ్ అని తేలింది.
గడిచిన 24 గంటల్లో మరణాల సంఖ్య చూస్తే.. చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, కర్నూలులో 9 మంది, నెల్లూరులో 9 మంది, అనంతపురంలో 8 మంది, పశ్చిమ గోదావరిలో 8 మంది, విశాఖపట్నంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కడపలో ఆరుగురు, ప్రకాశంలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఇక గడిచిన 24 గంటల్లో కేసులు చూస్తే..అనంతపురంలో 580, చిత్తూరులో 981, తూర్పు గోదావరిలో 875, గుంటూరులో 590, కడపలో 286, కృష్ణాలో 263, కర్నూలులో 834, నెల్లూరులో 423, ప్రకాశంలో 614, శ్రీకాకుళంలో 773, విశాఖలో 512, విజయనగరంలో 388, పశ్చిమ గోదావరిలో 893 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.