లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే. అమితాబ్‌కు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కరోనాని ధైర్యంగా జయించారు. అప్పటి నుండి ఇంట్లోనే ఉంటున్న అమితాబ్ కరోనాని జయించిన తర్వాత తొలిసారి బయటకు వచ్చారు.
తన ఇంటి ఆవరణలో కొన్ని దశాబ్ధాల క్రింద నాటిన వృక్షం ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన నేలకొరిగింది. దీంతో అదే ప్రాంతంలో మరో చెట్టును నాటి వాటితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారీ గుల్ మెహర్ చెట్టును 1976లో నా ఇల్లు ప్రతీక్షలో స్వయంగా నేనే నాటాను. అది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెలకొరిగింది. ఆగస్ట్ 12న మా అమ్మగారి పుట్టిన రోజు సందర్భంగా చెట్టు పడిన ప్రాంతంలోనే అమ్మ తేజి బచ్చన్ పేరుతో కొత్త గుల్మోహర్ చెట్టును నాటాను అని పోస్ట్ చేసారు.