కరోనా మహమ్మారి చిత్రసీమను వణికిస్తోంది. ప్రతి రోజు ఎవరో ఒకరు దీనిబారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు చికిత్స తీసుకుంటుండగా..ఈ మధ్యనే బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరి కరోనా బారిన పడింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటుండగా..తాజాగా ఈమె చెల్లెలుకు సైతం కరోనా వచ్చింది.
ఈ విషయం రూపాలి సోషల్ మీడియా వేదికగా ఆమె ఫోటో పోస్ట్ చేసి పేర్కొంది. “నాకు కూడా కరోనా పాజిటివ్ తేలింది. గత కొద్ది రోజులుగా నాకు జ్వరం ముక్కు సమస్యతో పాటు గొంతు సమస్య అలాగే నాలుక రుచి కూడా కోల్పోయినట్లు అనిపిస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, యోగా చేస్తున్నాం. కోవిడ్ మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. పాజిటివ్ మైండ్‌తో ప్రారంభ దశలోనే కోవిడ్‌ను జయించవచ్చని నేను నమ్ముతున్నాను అంటూ రూపాలి చెప్పుకొచ్చింది .