గుంటూరు ఐజి ప్రభాకరరావు కుమారుడు చైతన్య తో నిహారిక నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది. గురువారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. నిహారిక నిశ్చితార్ధం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, సాయి ధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వేడుకకు రాకపోయేసరికి ఫంక్షన్లో తీరని లోటుగా కనిపించింది.
యంగ్ హీరో నితిన్ వివాహానికి త్రివిక్రమ్‌తో సహా హాజరై కొత్త దంపతుల్ని ఆశీర్వదించారు. అయితే తన అన్న కూతురు.. పైగా జనసేన ఎంపీ అభ్యర్థి అయిన నాగబాబు డాటర్ నిశ్చితార్థ వేడుకలో పవన్ రాకపోవడం ఏంటి అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరు కాకపోవడానికి ఫ్యామిలీలో విభేదాలో.. నాగబాబుతో వైరమో కాదని.. ఆయన చాతుర్మాస దీక్షలో ఉండటమే అసలు కారణం అని తెలుస్తోంది. ఈ దీక్షకు సంబంధించిన హోమం, పూజలు ఉండటంతో పవన్ కళ్యాణ్.. నిహారిక నిశ్చితార్థ వేడుకకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.