కత్తి మహేష్..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసారు. శ్రీరాముని మీద ఫేస్ బుక్‌లో కత్తి మహేష్ అసభ్య కామెంట్స్ చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందడం తో ఆయన్ను అరెస్ట్ చేసారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. కాగా, కొన్ని నెలల క్రితం ఫేస్బుక్, ట్విటర్లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్‌లు పెట్టారు కత్తి మహేష్. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి.
వారి ఫిర్యాదుల ఆధారంగా సబైర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలుమార్లు కత్తి మహేష్‌ను విచారించారు. ఇవాళ మరోసారి విచారించిన పోలీసులు.. విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు.