కరోనా మహమ్మారి చిత్రసీమ ప్రముఖులను నిద్ర లేకుండా చేస్తుంది. ప్రతి రోజు ఎవరికో ఒకరికి ఈ కరోనా సోకుతుంది. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా వారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఉన్నారు. ఈ విషయాన్ని వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు.
చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎస్పీబీ కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆ హాస్పిటల్ డాక్టర్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెల్త్ కండిషన్ పై బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ తాజా ప్రకటన తో అభిమానులు, సంగీత ప్రియులు హమ్మయ్య అనుకుంటున్నారు.