చిత్రసీమ ను కరోనా వెంటాడుతూనే ఉంది. ఆర్థికంగానే , ఆరోగ్య పరంగా కూడా కరోనా నిద్రలేకుండా చేస్తుంది. ఓ పక్క గత నాల్గు నెలలుగా షూటింగ్ లు బంద్ కావడం , థియేటర్స్ మూతపడడం తో ఆర్ధికంగా ఇబ్బంది పడుతుండగా..ఇప్పుడు వరుస పెట్టి కరోనా వస్తుండడం అందర్నీ కలవరపెడుతుంది. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా..తాజాగా తెలుగు, తమిళ హీరోయిన్‌కి కరోనా సోకింది.
హీరోయిన్ నిక్కీ గార్లానికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా కొద్ది గంటల ముందు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కోవిడ్‌కి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. నా కోసం చికిత్స అందించిన వైద్యులకు థ్యాంక్స్ అని ట్వీట్లో పేర్కొంది నిక్కీ. కాగా నిక్కీ గార్లానీ నటుడు సునీల్ నటించిన కృష్ణాష్టమి సినిమాలో నటించింది. ఆ తరువాత తమిళ్లో కూడా సినిమాలు చేస్తుంది. ఇక ప్రస్తుతం లారెన్స్ నటిస్తున్న రంగస్థలం తమిళ్ రీమేక్‌లో సమంత పాత్రలో నిక్కీ నటిస్తున్నట్టు సమాచారం.
I was tested Positive for #COVID-19 last week.
I’m on my way to recovery and feeling much better now ???
I’d like to thank my close ones for looking out for me, all the frontline Health Workers & mainly the #Chennai #TamilNadu #Corporation for their Constant Support ♥️ pic.twitter.com/bk6QsIqqZz— Nikki Galrani (@nikkigalrani) August 13, 2020