మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశము చేసిన నిహారిక మొదటి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. చివరగా చేసిన ‘సూర్యకాంతం’ సినిమాకూడా నిహారికకు నిరాశపరిచింది. ఇక సినిమాలు వర్క్ అవుట్ కాదని తెలుసుకున్న ఈ మెగా డాటర్ పెళ్లికి సిద్ధమైంది.
గుంటూరు ఐజి ప్రభాకరరావు కుమారుడు చైతన్య ను పెళ్లి చేసుకోబోతుంది. కొద్దిరోజులుగా నిహారిక తనకు కాబోయేవాడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తుంది. కాగా నిహారిక- చైతన్య నిశ్చితార్ధ వేడుక ఈరోజు అట్టహాసంగా జరిగింది. గురువారం ఈరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. నిహారిక నిశ్చితార్ధం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, సాయి ధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అతి కొద్ది మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం పంపించారు.

Pics from @IamNiharikaK's Engagement with Chaitanya today at Hyderabad

Best Wishes to the Couple. pic.twitter.com/Bukx5l4b9k
— BARaju (@baraju_SuperHit) August 13, 2020