ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు చెప్పే పరిస్థితి లేవు. ప్రతి రోజు కూడా 10 వేలకు చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్రత భారీగా పెరిగింది. అలాగే మరణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 58,315 మందికి కరోనా టెస్టులు చేయగా, ఏకంగా 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,41,654కు చేరాయి. అలాగే 24 గంటల్లో కొత్తగా 87 మంది మృతి చెందగా, ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 2203కి పెరిగింది.
జిల్లాల వారీగా కొత్త కేసులు చూస్తే.. అనంతపురంలో 959, చిత్తూరులో 758, తూర్పు గోదావరిలో 1372, గుంటూరులో 717, కడపలో 579, కృష్ణాలో 342, కర్నూలులో 1138, నెల్లూరులో 364, ప్రకాశంలో 343, శ్రీకాకుళంలో 504, విశాఖలో 676, విజయనగరంలో 594, పశ్చిమ గోదావరిలో 678 కేసులు నమోదయ్యాయి.