వామపక్షాల దీక్షకు పెరుగుతున్న మద్ధతు

left-partiesరాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సమస్యపై వామపక్ష పార్టీలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ సర్ చార్జీలు ఎత్తివేయాలని ఇందిరాపార్క్ దగ్గర 8 వామపక్ష పార్టీలు చేస్తున్న దీక్షలు మూడో రోజుకు చేరాయి. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు రాఘవులు, నారాయణ నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం దిగిరాకపోతే మరో బషీర్ బాగ్ ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని వామపక్ష నాయకులు హెచ్చరించారు. అయితే వామపక్షాలు చేపట్టిన దీక్షకు రోజు రోజుకు మద్ధతు పెరుగుతుంది. టీడీపీ నాయకులు ఈరోజు(సోమవారం) దీక్షాస్థలికి చేరుకొని వామపక్షాలు చేపట్టిన దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించాయి. టీఆర్ ఎస్ ఇప్పటికే వామపక్షాల దీక్షకు మద్ధతు తెలపగా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేకే లాంటి వారు సైతం వీరి దీక్షకు మద్దతును తెలిపారు. వైకాపా కూడా ను వామపక్షాల చేపట్టిన దీక్షకు ఈరోజు మద్దతును ప్రకటించింది.

మరోవైపు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఈరోజు (సోమవారం) వామపక్షనేతలను పరామర్శించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ.. ఆరోగ్య కారణాల రీత్యా వామపక్ష నేతలు దీక్షను విరమించాలని కోరారు. పదిహేనేళ్లుగా రాష్ర్టంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే విద్యుత్ సంక్షోభం తలెత్తిందని జేపీ ఆరోపించారు. ఈ సంక్షభం నుండి బయటపడటానికి మరో ఐదేళ్లు పడుతుందని జేపీ అన్నారు.