ఇటీవల కాలంలో కరోనా వైరస్ తో చాలామంది సినీ ప్రముఖులు హాస్పటల్ లో చేరుతున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరిన సరే వారికీ కరోనా అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత, థియేటర్స్ అధినేత సునీల్ నారంగ్ ఆరోగ్యం పై పలు వదంతులొస్తున్న నేపథ్యంలో
నారంగ్ సోదరుడు భరత్ నారంగ్ క్లారిటీ ఇచ్చారు.
“రాత్రి సడెన్ గా గుండె నొప్పి రావడంతో ఆయనను అపోలో హాస్పిటల్ లో చేర్పించాము. డాక్టర్స్ వెంటనే స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. రేపు డిశ్చార్జ్ అవుతారు. తన ఆరోగ్యం గురించి ఫోన్లు చేస్తున్న అందరికీ సునీల్ నారంగ్ కృతజ్ఞతలు చెప్తూ తాను క్షేమంగా ఉన్నట్లు, రేపు డిశ్చార్జ్ అవుతున్నట్లు తెలుపమన్నారు.” అని భరత్ నారంగ్ తెలిపారు.