సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు కరోనా వచ్చిందనే వార్తలు వైరల్ కావడం తో అభిమానులు , సినీ ప్రముఖులు షాక్ లో పడ్డారు. ఈ వార్త తెలుసుకున్న చాలామంది ఆయన ఆరోగ్యం ఫై ఆరా తీస్తుండడం తో ఈ వార్తల ఫై వర్మ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.
తన ట్విట్టర్ లో డంబెల్ ఎత్తి కసరత్తులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. నాకు తీవ్ర జ్వరం వచ్చిందని ప్రచారం అవుతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. వరుస సినిమాలు చేస్తున్నా. సీరియస్గా వర్కవుట్స్ కూడా చేస్తున్నా. ఫ్రెండ్స్ మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి అంటూ ఆర్జీవి తన ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు.
In the wake of malicious rumours from some media outlets like one below, just wanted to clarify to whoever concerned that I am SUPER FIT https://t.co/xajKM11Z1w pic.twitter.com/FB2Q1gaTtN— Ram Gopal Varma (@RGVzoomin) August 9, 2020