బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ తన గొప్ప మనసు చాటుకుంది. గత నాల్గు నెలలుగా షూటింగ్ లు బంద్ కావడంతో చిత్రసీమ నే నమ్ముకున్న కార్మికుల కష్టాలు అన్ని ఇన్ని కావు. కనీసం తినడానికి తిండి కూడా లేక అలమటిస్తున్నారు. ఈ క్రమంలో కత్రినా కైఫ్ వందమంది డాన్సర్లకు సాయం చేసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో డ్యాన్సర్కి పూట గడవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న కత్రినా కైఫ్ 100 మంది నేపథ్య నృత్యకారులకు ద్రవ్య సహాయం అందించారు.
దీంతో కొందరు టిఫిన్ సెంటర్స్, కూరగాయల మార్కెట్స్ పెట్టుకోవడానికి డబ్బు ఉపయోగించారు. ఓ సీనియర్ నర్తకి మాట్లాడుతూ..ప్రతిరోజు ఉదయం ఎపిఎంఎస్ మార్కెట్లో కూరగాయలు కొని పరిసర ప్రాంతాలలో అమ్మేందుకు వెళ్తాను అమ్మేందుకు వెళతాను చెప్పుకొచ్చింది.