రానా- మిహికా ల వివాహం రామానాయుడు స్టూడియో లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వివాహ బంధం తో ఒకటయ్యారు. కరోనా వైరస్ కారణంగా వివాహ వేడుకకు పెద్దగా ఎవర్ని ఆహ్వానించలేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత అదిరిపోయే వేడుక చేయాలని చూస్తున్నారు దగ్గుబాటి ఫ్యామిలీ.
ఈ వివాహ వేడుకకు చిత్ర సీమా నుండి కేవలం రామ్ చరణ్, శర్వానంద్ మాత్రమే హాజరయ్యారు. మిగతా వారంతా కూడా కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారు. నాగార్జున కుటుంబం సైతం కనిపించక పోవడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఈ వివాహ వేడుక పిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.