పెళ్లి వేడుకల్లో రానా – సామ్ సందడి

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఈరోజుతో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ రోజే (ఆగస్టు 8) రానా- మిహికా వివాహ వేడుక రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఇప్పటికే అన్నిఏర్పట్లు పూర్తి చేసారు.  హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, పెళ్లి కొడుకును చేయడం లాంటి కార్యక్రమాలతో రెండు కుటుంబాలు రెండు రోజులుగా సందడి సందడిగా మారాయి.  బుధవారం మిహీకా బజాజ్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో మిహీకా పసుపు వర్ణం లెహెంగాలో మెరిసిపోయారు. అలాగే, రానా తెలుపు రంగు షర్ట్, ధోతిలో సంప్రదాయబద్ధంగా కనిపించారు. 


ఇక గురువారం మిహీకా మెహందీ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్లో సమంత పాల్గొని సందడి చేశారు. కాబోయే పెళ్లికూతరు మిహీకాతో పాటు సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిహీకా లేత గులాబీ వర్ణం జాకెట్ లెహెంగాలో మెరవగా.. సమంత పైనాపిల్ ఎల్లో వింటేజ్ గార్డెన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డ్రెస్‌లో జిగేల్‌మనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వైరల్ ఫొటోల్లో రానా, సమంత కలిసి ముచ్చట పెడుతున్నట్లు కనిపించారు.