సుశాంత్ సూసైడ్ కేసు : రియా కాల్ డేటా లో సంచలన నిజాలు

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు వినిపిస్తుండడం తో అంత నిజమే కావొచ్చని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కేసును సిబిఐ కి అప్పగించింది.

రంగంలోకి దిగిన సిబిఐ కేసు క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌ రియా ఫోన్‌ కాల్‌ డేటాను సేకరించింది. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రియా, తన కుటుంబ సభ్యులు సుశాంత్‌ను బలవంతంగా మానసిక వైద్యశాలకు పంపించాలని చూసినట్లు వెల్లడైంది. అంతేగాక సశాంత్‌కు రియా పదే పదే ఫోన్‌ చేసి వేధించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇదంతా సుశాంత్‌ జనవరి 20 నుంచి 24వ తేదీల్లో చండీఘర్‌లో తన సొదరి రాణితో ఉన్నప్పుడు జరిగింది. 5 రోజుల్లో దాదాపు 25 సార్లు రియా సుశాంత్‌కు ఫోన్‌ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో సుశాంత్‌ జవనరి 2020లో చండీఘర్‌లోని తన సోదరి రాణి ఇంటికి వెళ్లీనప్పుడు రియా పదే పదే ఫోన్‌ చేసి తన దగ్గరికి తిరిగి రవాలని, తనకు సహాయం చేయమని అడిగినట్లు తన కాల్‌ డేటాలో వెల్లడైంది. మరి ఈ కాల్ డేటా లో ఇంకెన్ని విషయాలు బయటపడతాయి చూడాలి.