భల్లాల దేవా ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతుండడం తో అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు. తాను ప్రేమించిన మిహీకా బజాజ్ ను ఆగస్టు 08 న వివాహం చేసుకోబోతున్నాడు. పెళ్ళికి రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం తో ఇరు కుటుంబాల్లో పెళ్లి సంబరాలు మొదలు అయ్యాయి.
పెళ్లికూతురు మిహికా బజాజ్ హల్దీ వేడుకలో మెరిసిపోయింది. వివాహానికి ముందు జరిగే ఈ వేడుకలో మిహికా పసుపు-ఆకుపచ్చ లెహంగాలో ఆకర్షణీయంగా నిలిచారు. ప్రత్యేక సీషెల్స్ డిజైనర్ ఆభరణాలతో ఆకట్టుకుంటున్నారు.