సోనియా కొవ్వొత్తులు.. రాహుల్ విసనకర్రలు..!

payyavula-fire-on-govt-for-విద్యుత్ సమస్యపై శాసనసభలో చర్చ చేపట్టాలని ప్రధాన ప్రతిక్షం టీడీపీ చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు ఫలించింది. ఈరోజు (సోమవారం) విద్యుత్ సమస్యపై శాసనసభలో స్వల్ప కాలిక చర్చికు స్వీకర్ అనుమతిని ఇచ్చారు. ఈ సందర్భంగా.. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు, చేతివృత్తులు తదితర రంగాల వారు విద్యుత్ కోతలతో అవస్థ పడుతున్నారని అన్నారు. విద్యుత్ కోతలు పెరగడంతో.. పగటిపూట సూర్యుడిపైనా, రాత్రిపూట చంద్రుడిపైనా ఆధారపడాలని ప్రభుత్వం చెబుతోందని కేశవ్ ఎద్దేవా చేశారు.

గ్రామాల్లో 7 గంటలు కాదు 7 నిమిషాలపాటు కూడా కరెంట్ ఉండటం లేదని ఆయన అన్నారు. అయితే పల్లెల్లో, పట్టణాల్లో కరెంట్ బిల్లులు ఒక్కటే అయినప్పుడు కోతల్లో తేడా ఎందుకు అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామ ప్రజలు విద్యుత్ సమస్యలపై నిలదీస్తే కిటికీలు తెరచుకోవాలని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారని ఆయన అన్నారు. రాష్ర్టంలో విధ్యుత్ కోతలు అధికమవుతున్న నేపథ్యంలో.. సోనియా కొవ్వొత్తులు, రాహుల్ విసన కర్రలు ప్రభుత్వ రాయితీపై ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

గుజరాత్ రాష్ర్టం 2004 నాటికి అభివృద్ధిలో ఏపీ కంటే వెనుకంజలో ఉండేదని, ఇప్పుడు గుజరాత్ ఎలాంటి విద్యుత్ సమస్యలను ఎదుర్కొవటం లేదని ఆయన అన్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి తాను నడుస్తుంటే గంగమ్మ తల్లి పారినట్లుగా చెప్పుకున్నారని, ఇప్పుడు కిరణ్ కూడా తన హయాంలో కిరణాలు ఉదయిస్తున్నాయని చెబుతున్నారని, అయితే ఆ కిరణాలు గ్రామీణ, పట్టణ ప్రజలకు సమానంగా విద్యుత్ ను ఇవ్వాల్సిందేనని పయ్యావుల డిమాండ్ చేశారు.