కరోనా మహమ్మారి వలలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పడగా..తాజాగా ప్రముఖ సింగర్ స్మిత సైతం దీనిబారిన పడింది. ఈమె తో పాటు తన భర్తకు కూడా కరోనా వచ్చినట్లు స్వయంగా తెలిపింది.
‘‘నిన్న చాలా ఇబ్బందికరమైన రోజు. బాగా ఒళ్లు నొప్పులు చేయడంతో, హెవీ వర్కవుట్స్ వల్ల ఏమో అనుకున్నాను. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకోగా, నాకూ.. అలాగే నా భర్త శశాంక్‌కు కరోనా పాజిటివ్‌గా రిజల్ట్‌లో వచ్చింది. పెద్దగా లక్షణాలు అయితే కనిపించలేదు. మేము ఇంటిపట్టునే క్షేమంగా ఉన్నా కూడా మా ఇంటిలోకి కోవిడ్ వచ్చి చేరింది. త్వరగా కరోనాని జయించి, ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను..’’ అని స్మిత తన ట్వీట్లో పేర్కొంది. కాగా.. స్మిత మరియు ఆమె భర్త త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సెలబ్రిటీలు కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
Mad mad day yesterday. Had some body pains which I thought was due to heavy workout but got tested to be on safe side. Shashank & I tested covid positive. Mostly asymptomatic. Waiting to kick Covid out, donate plasma & chill?? We Stayed Home Stayed Safe but Covid came home ?— Smita (@smitapop) August 4, 2020