ఏపీలో కరోనా ఉదృతి ఏ స్థాయి లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకు కొత్త కేసులే కాదు భారీ సంఖ్యలో మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. కరోనా బారిన సామాన్య ప్రజలే కాక రాజకీయ నేతలు సైతం భారీగా పడుతున్నారు. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా..అందులో కొంతమంది మరణించడం కూడా జరిగింది.
తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా సోకింది. దీంతో ఆయన బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే కరణం కుటుంబ సభ్యులతో పాటు, ఆయనతో కాంటాక్ట్ అయిన అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యులు.