ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు కరోనా..

తెలంగాణ రాష్ట్రం లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలే కాక రాజకీయ నేతలు సైతం దీనిబారిన పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు దీనిబారిన ఎక్కువగా పడుతున్నారు. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా..తాజాగా కరీంనగర్ జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఆయనతో పాటు ఇంట్లో వర్కర్లు, కుటుంబ సభ్యులతో సహా 8 మందికి కరోనా పాజిటివ్ అని చెబుతున్నారు. అలాగే డ్రైవర్‌కు, ఇద్దరు గన్‌మెన్లకు కూడా కరోనా ‌పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నారదాసు లక్ష్మణ్ కుటుంబం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు.