బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కాగా సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోగా, దీనిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దీనిలో భాగంగా చాలామందిని ఇప్పటికే పోలీసులు విచారించడం జరిగింది. కాగా ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసును దర్యాప్తు చేసేందుకు ముంబై నుండి వచ్చిన బిహార్ పోలీసు అధికారి వినయ్ తివారీని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కు తరలించారు. అతడిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది. కాగా ఈ ఘటన పై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్వీట్ చేసారు. తివారీకి వసతి కల్పించాలని తాము కోరినా, అతని చేతికి క్వారంటైన్ స్టాంపు వేసి క్వారంటైన్ చేశారని డీజీపీ పేర్కొన్నారు.