బెయిలొచ్చే.. సస్పెన్షన్ పోయే..!

bail-grant-for-JAC-leadersసడక్ బంద్ సందర్భంగా అరస్టై మహబూబ్ నగర్ జైలులో ఉన్న తెలంగాణ జేఏసీ నేతలకు ఆలంపూర్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. జేఏసీ నేతల తరపున హైకోర్టు సీనియర్ లాయర్లయిన ప్రకాష్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ చేరుకొని వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న కోర్టు తీర్పును మధ్యాహ్నానానికి వాయిదావేసింది. తీర్పు ఎలావుంటుందోనని తెలంగాణ వాదులు వేలాదిగా తరలిరావడంతో.. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా తయారయింది.

నాటకీయ పరిణామాల అనంతరం కోర్టు శనివారం సాయంత్రం సడక్ బంద్ సందర్భంగా అరెస్టయిన 11 మందిలో ఎనిమిదిమందికి బెయిలిచ్చింది. అయితే అరెస్టయిన 11 మందిలో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు కావేటి సమ్మయ్య, గట్టి తిమ్మన్న, తుమ్మల రవికుమార్ లు ఈరోజు ఉదయం కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన ముగ్గురికి కోర్టు ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించింది. కాగా, అరెస్ట్ చేసిన 48 గంటలలోపే విడుదల కావడంలో కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ లు సస్పెన్షన్ వేటు నుంచి బయటపడ్డారు.