‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2020’

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2020’ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అలాగే నూతన విద్యా విధానంపైనా ప్రధాని తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.

విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా 2017 నుంచి స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.