ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్ష కేసులు దాటగా , మంగళవారం కూడా కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి . మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకే రోజు రికార్డు స్థాయిలో 58 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 62,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏకంగా 7,948 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,10,297కు చేరింది.
అత్యధికంగా తూర్పు గోదావరిలో 1367, కర్నూలులో 1146 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 11 మంది, కర్నూలులో 10 మంది, విశాఖలో 9 మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, నెల్లూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు, అనంతపూర్లో ముగ్గురు, కడపలో ఒకరు, శ్రీకాకుళం ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు.