కరోనా నుండి బయటపడ్డ ఐష్..

ఐష్ అభిమానులకు గుడ్ న్యూస్..ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ కరోనా నుండి భయపడ్డారు. జులై 12న అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా ల‌క్షణాలు ఉండ‌డంతో వైద్యులు టెస్ట్ లు చేశారు. ఆ టెస్ట్ ల్లో అమితాబ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్య‌రాయ్ ఆమె కుమార్తె ఆరాద్య‌కు క‌రోనా పాజిటీవ్ వచ్చింది. అయితే అమితాబ్ బ‌చ్చ‌న్, అభిషేక్ బ‌చ్చ‌న్ లీలావతి హాస్పటల్ లో జాయిన్ కాగా , ఐశ్వ‌ర్య‌రాయ్ ఆమె కుమార్తె ఆరాద్య మాత్రం వారం రోజులు ఇంట్లోనే నుండి చికిత్స తీసుకున్నారు. అయితే వారికీ కరోనా తగ్గకపోవడంతో వారిని కూడా హాస్పటల్ లో జాయిన్ చేసారు.

ప్రస్తుతం ఐష్ కు అలాగే ఆరాధ్య కు టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు. ఈ విషయన్ని అభిషేక్ బచ్చన్‌ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఐశ్వర్య, ఆరాధ్యకు టెస్ట్‌ల్లో నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వారు ఇంట్లో ఉన్నారు. నేను, నాన్న ఇంకా వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాము అని అభిషేక్ ట్వీట్ చేశారు.