కరోనా కేసుల్లో టాప్‌ 10 రాష్ట్రాలివే..

భారత్‌లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో దాదాపు అర లక్ష కేసులు నమోదవడం ఈ మహమ్మారి వ్యాప్తి తీవ్రతకు అద్దంపడుతోంది.  

కేసుల్లో టాప్‌ 10 రాష్ట్రాలివే..
కరోనా ప్రభావం అత్యధికంగా కొనసాగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. నేటి ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన సమాచారం‌ ప్రకారం.. 3,75,799 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (2,13,723), దిల్లీ (1,30,606), ఆంధ్రప్రదేశ్‌ (96,298), కర్ణాటక (96,141), ఉత్తర్‌ప్రదేశ్‌ (66,988), పశ్చిమ్‌ బెంగాల్‌ (58,718), గుజరాత్‌ (55,822), తెలంగాణ (54,059), బిహార్‌ (39,176) కొనసాగుతున్నాయి.