తెలంగాణలో శనివారం ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయంటే..

తెలంగాణ రాష్ట్రం కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు..GHMC పరిధిలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మిగతా జిల్లాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పట్టణం వదిలి అంత సొంతర్లకు వెళ్తుండడం తో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా శనివారానికి సంబందించిన హెల్త్ బులిటిన్ ను ఆరోగ్య శాఖా విడుదల చేసింది.

శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1593 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,059కి చేరగా, ఇప్పటి వరకు కరోనాతో 463 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 41,332 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 12,264 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 641 కొత్త కేసులు నమోదు నమోదు కాగా, ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 171 కొత్త కేసులు నమోదు నమోదు అయ్యాయి.

#COVID19India #Telangana

New Cases – 1,593
Active Cases – 12,264
Total Cases – 54,059#WearAMask #StayHome pic.twitter.com/B057Egjr5Z— BARaju (@baraju_SuperHit) July 26, 2020