కరోనా దెబ్బ అందర్నీ రోడ్డున పడేసింది..ఎంతో దర్జాగా బ్రతికిన వారంతా ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చారు. ముఖ్యముగా సినీ కార్మికులు , సైడ్ క్యారెక్టర్ చేసేవారు గత మూడు నెలలుగా షూటింగ్ లు బంద్ కావడం తో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తాజాగా కార్తికా సాహూ తన ఫ్యామిలీ కోసం కూరగాయలు విక్రయం చేస్తున్నాడు.
ఒడిశా కేంద్రాపాడ జిల్లాలోని గరద్పూర్కు చెందిన సాహూ కొన్నాళ్లు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులకు బాడీగార్డ్‌గా పనిచేశాడు చివరకు 2018లో సినిమా అవకాశాలు అందుకున్నాడు. చాలా సినిమాలలో యాక్షన్ సన్నివేశాలతో గుర్తించే పాత్రలని పోషించిన ఆయన సూర్యవంశీలో కూడా ఫైట్ సీక్వెన్స్ చేసినట్టు చెప్పాడు. కరోనా వలన ఉపాధి లేకపోవడంతో కూరగాయల విక్రయం ద్వారా పొట్ట నింపుకుంటున్నాని అంటున్నాడు.