దేశంలో కరోనా కేసులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కేంద్రం కరోనా పరీక్షల సంఖ్య పెంచింది. గత 24 గంటల్లో 4,42,031 నమూనాలను పరీక్షించామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇంత పెద్దమొత్తంలో పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటి సారని వెల్లడించింది.
అదేవిధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ల్యాబుల్లో 3,62,153 నమూనాలకు కరోనా పరీక్షలు చేశామని తెలిపింది. ఇది కూడా ఒక రికార్డని వెల్లడించింది. ప్రైవేట్ ల్యాబుల్లో ఒకేరోజు 79,878 నమూనాలను పరీక్షించామని పేర్కొంది. అలాగే ఇప్పటివరకు మొత్తం 8,49,431 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. రికవరీ రేటు 63.54 శాతానికి పెరిగిందని వెల్లడించింది.