మిహికా విశేషాలను తెలిపిన రానా

భల్లాల దేవా ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతుండడం తో అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు. తాను ప్రేమించిన మిహీకా బజాజ్‌ ను ఆగస్టు 08 న వివాహం చేసుకోబోతున్నాడు. ఈ సందర్భాంగా తనకు కాబోయే భార్య గురించి ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.

నా ప్రేమికురాలు మిహికా ఇల్లు మా ఇంటికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మేమంతా ఒకే ప్రాంతంలో ఉంటాం. జీవితంలో కొన్ని సార్లు అన్నీ సజావుగా సాగిపోతుంటాయి. తను చాలా మంచిది. నాకు కరెక్ట్ జోడీ. మేం చాలా గొప్ప జంటగా నిలుస్తాం. ఆగస్టు 8న మా వివాహం జరుగబోతోంది. ఆ రోజు నా వ్యక్తిగత జీవితంలో అత్యుత్తమమైన, అద్భుతమైన రోజని రానా అభిప్రాయపడ్డాడు.